Header Banner

గృహ రుణాలకు గోల్డెన్ ఆఫర్! ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ, తక్కువ ఈఎంఐ!

  Thu Feb 27, 2025 12:47        Business

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే తక్కువ వడ్డీ రేట్లకే ప్రభుత్వ రంగానికి చెందిన మరో ఆరు బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి, ఏ వడ్డీ రేట్ల వద్ద రుణాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం.

ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం గృహ రుణాల గ్రహీతలకు ఊరట కలిగిస్తోంది. అక్టోబర్ 01, 2019 తర్వాత రిటైల్ ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను రెపో రేటుకు అనుసంధానించారు. ఈ మేరకు ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు కూడా రేటు తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందించాల్సి ఉంటుంది. గృహ రుణాలు తీసుకునే వారిపై ఇది భారాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆర్బీఐ తాజాగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధించి 6.25 శాతానికి తగ్గించింది. దీంతో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీలను తగ్గించాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!

 

రిజర్వు బ్యాంక్ నిర్ణయంతో గృహ రుణ వినియోగదారులకు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించిన మొదటి ప్రధాన బ్యాంకుల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిలిచింది. ఎస్బీఐ తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 8.25 శాతం వడ్డీతో ప్రారంభమయ్యే గృహ రుణాలను ఖాతాదారులకు అందిస్తోంది. ఇది హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకుల ప్రారంభ రేట్ల కంటే తక్కువ. అయితే వివిధ రుణదాతల వెబ్‌సైట్ల డేటా ప్రకారం ఫిబ్రవరి 2025లో ఆరు బ్యాంకులు ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్ల వద్ద రుణాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తోంది. ఒక వ్యక్తి రూ.50 లక్షలను రుణంగా తీసుకుంటే నెలకు రూ.42,133 చొప్పున 20 సంవత్సరాలపాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 8.1శాతం వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకు 8.15 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో రూ.50 లక్షలను గృహ రుణంగా తీసుకుంటే రూ.42,289 నెలవారీ ఈఎంఐ చొప్పున 20 సంవత్సరాలపాటు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు పైన తెలిపిన ప్రభుత్వ రంగ రుణదాతలకు భిన్నంగా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు 8.75 శాతం వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ రేటు వద్ద రూ.50 లక్షలు గృహ రుణంగా తీసుకుంటే 20 సంవత్సరాలపాటు నెలకు రూ.44,185 చెల్లించాలి. అయితే రుణదాతలు అందించే తుది గృహ రుణాల రేట్లు గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.

 

ఇది కూడా చదవండి


వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #homeloans #lowinteresthomeloans #latestnews #newsabouthomeloans #lowemihomeloans